Mandamarri Govt School Students : ప్రభుత్వ పాఠశాలలో సైన్సు పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడికి ఎందుకో ఏమో ఒక ఆలోచన తట్టింది. వ్యవసాయం గురించి పాఠాలు చెప్పడం కంటే పొలంలోకి విద్యార్థులను తీసుకువెళ్తే వారికి ఎక్కవ లాభం చేకూరుతుందమోనని భావించాడు. ఇలా అనుకోగానే మరుసటి రోజు విద్యార్థులకు విషయాన్ని చెప్పాడు. అంతే నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు పొలంబాట పట్టడానికి మంచి ఆసక్తి చూపారు.