CM Revanth Reddy Distributed Appointment Letters To Junior Lecturers : నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపిక అయిన 1,532 మందికి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాని అన్నారు.