అంతరిక్షంలో అడుగులు పెట్టే సౌకర్యాలు మెరుగవుతున్నా ఆదివాసులు అత్యధికంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బడి పిల్లలను అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడలో పాఠశాల లేక తడికల షెడ్డులో సగం దేవుని ఆలయంలో సగం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాల గతంలో ఒక అద్దె ఇంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటి యజమాని ఖాళీ చేయించారు.