హైదరాబాద్ నగరంలో అకాల వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మూసీ నదికి వరద పోటెత్తింది. చైతన్యపురిలో మూసీలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను రక్షించారు. మూసారంబాగ్ మూసీ వంతెన వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అటు అకాల వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సరూర్నగర్లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.