Eagle Team IG Ravi Krishna Exclusive Interview: రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ వెల్లడించారు. ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా కాకుండా 12 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఒడిశా నుంచి ఏపీ మీదుగా ప్రయాణించే రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీలు నిర్వహిస్తూ ఐజీ రవికృష్ణ బృందం విజయవాడ వరకు ప్రయాణించారు. గంజాయి సాగు, రవాణా, వాడకం లేకుండా చేయడమే ఈగల్ టీమ్ లక్ష్యమని పేర్కొన్నారు. రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రైలులో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది 21 వేల 700 కిలోల గంజాయి పట్టుకున్నామని, గంజాయి రవాణా చేసేవారి ఆస్తులు జప్తు చేస్తున్నామని రవికృష్ణ చెప్పారు. ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ ఆపరేషన్ ఈగిల్ పేరిట రైళ్లలో గంజాయి రవాణాపై సోదాలు నిర్వహిస్తున్న ఈగిల్ ఐజీ రవికృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి.