Padmasali Mahasabha at Hyderabad : 'తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం నీడ లేని వాళ్లకు తన ఇల్లును ఇచ్చారు కొండా లక్ష్మణ్ బాపూజీ. నీడనిచ్చిన ఆయనను తెలంగాణ వచ్చిన తర్వాత నిలువనీడ లేకుండా చేశారు కొందరు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదు. టెక్స్టైల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా పెడతాం.' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 8వ పద్మశాలీల మహాసభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు.