Sabala Millets Stall : మణికొండ ల్యాంకో హిల్స్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రామోజీ గ్రూపు ఆధ్వర్యంలో సబల స్టాల్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సబల పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్లెట్ నూడిల్స్, ప్రొటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, వన్ పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రొటీన్ మీల్ బార్, ప్రొటీన్ డేట్ అండ్ అల్మండ్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరు ధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి.
అలాగే పొంగల్, సాంబార్ మీల్, ఉప్మా, కేసర్ బాదం మీల్, మూంగ్ కిచిడీ, మసాలా కిచిడీ, చక్కర పొంగల్, రాజస్థానీ మూంగ్ దాల్, తమిళనాడు సక్కరాయి పొంగల్, తమిళనాడు పొంగల్, గుజరాతీ వెంఘరేలి కిచిడీ, బెంగాళీ షోగర్ కిచిడీ, కర్ణాటక బిస్మల్లాబాత్, మిల్లెట్ మొరింగా, మిల్లెట్ కోకా, మిల్లెట్ ఓట్స్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు ప్రియా పచ్చళ్లు సైతం స్టాల్లో అందుబాటులో ఉంచారు. ఎప్పట్నుంచో చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటున్నామని నాణ్యత, మన్నికకు మారు పేరైన సబల బ్రాండ్ ఉత్పత్తులను రుచి చూస్తామని వినియోగదారులు చెబుతున్నారు.