BRS New Song : బీఆర్‌ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ పాటను రూపొందించి విడుదల చేశారు. మరోవైపు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా సభకు తరలివస్తారని బీఆర్‌ఎస్ అంచనా వేసి ఆ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు.. అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంతపు బుతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన. అస్తిత్వం కొరకై ఆరాట పడిన ఆత్మ గౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన బీఆర్‌ఎస్ అంటూ సాగి జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ సాగుతూ ఉంటుంది ఈ గీతం. బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఈ అద్భుతమైన గీతాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాటను రూపొందించారు.