Arrangements Of Bhavani Deeksha Viramana : మండలం రోజుల పాటు అకుంటిత భక్తితో పూజలాచరించి అమ్మవారికి ఇరిముడి సమర్పించేందుకు తరలివచ్చే లక్షాలాధి భవానీ ధీక్షాదారులైన భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భవానీ దీక్షలు విరమణ చేసుకుని త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు. భవాని ధీక్షల విరమణ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ లక్ష్మిశ, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబులు, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈనెల 21 నుండి 25 వరకు భవానీ భక్తులు అమ్మవారికి ఇరిముడులు సమర్పించి దీక్షాలు విరమించనున్నారని కలెక్టర్ అన్నారు.