CM Revanth Reddy Participated in Book Inauguration : అధికారులు ఎంత నిబద్ధత చూపితే పథకాలు అంత విజయవంతమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన "లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి - మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్" పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని అన్నారు. కానీ, ఇప్పటి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ గదుల వీడేందుకు ఇష్ట పడట్లేదని తెలిపారు.