CM Revanth Reddy Comments on KCR : తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.