Blackmail on Madhu Private Hospital Chairman Gur Reddy in Adoni : కర్నూలు జిల్లాలో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని పట్టణంలో ఉన్న మధు ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు గుర్రెడ్డిని బసాపురం గ్రామానికి చెందిన రఘునాథ్, అడివేష్ అనే వ్యక్తులు బెదిరించారు. నిందితులు ఇద్దరు ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆర్టీఐ పిటీషన్లు వేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చివరికి రూ. 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆసుపత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసుల పై కూడా నిందితులు దాడి చేశారు. దీంతో బ్లాక్ మెయిల్, పోలీసులపై దాడి చేసిన నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించమని ఒకటో పట్టణ సీఐ శ్రీరామ్ తెలిపారు.