UPSC Ranker Keerthi Reddy : సివిల్స్ సాధించాలనేది ఆ యువతి కల. ఐతే ఒక ట్రెండుసార్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఇక ఆపేద్దాం అనుకుంటాం. అలాంటిది ఐదుసార్లు సివిల్స్‌లో విఫలమైనా ఆరో ప్రయత్నంలో కడపకు చెందిన కీర్తిరెడ్డి 316వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు అడుగులు వేసింది. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సహంతో గతంలో జరిగిన పొరబాట్లను సరిదిద్ధుకుని విజయం సాధించానంటున్న కీర్తిరెడ్డితో ఈటీవీ భారత్ చిట్‌చాట్.