UPSC Civils Ranker Sravan Kumar Reddy Interview : యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటాడు హైదరాబాద్ కుర్రాడు చింతకింద శ్రవణ్ కుమార్ రెడ్డి. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 62వ ర్యాంకు సాధించారు. ఐదు సార్లు అనుకున్న లక్ష్యం దక్కకపోయినా నిరాశాపడలేదు. పట్టువిడువలేదు. కష్టపడి ఆరో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు శ్రవణ్ కుమార్ రెడ్డి. 2023 లోనూ యూపీఎస్సీ ర్యాంకు సాధించిన శ్రవణ్ కుమార్ రెడ్డి రైల్వై మేనేజ్మెంట్ సర్వీసుల్లో చేరారు. అయినా తృప్తి లేదు. తాను కావాలనుకుంది అది కాదు. తన తండ్రి కలలు కన్న ఐఏఎస్ తాను సాధించాలన్న పట్టుదలతో మరో మారు ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం చేరిన చింతకింద శ్రవణ్ కుమార్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి.