Police Lathi Charge in Dilsukhnagar : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రాత్రి లాఠీఛార్జ్ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో అభిమానులు దిల్సుఖ్నగర్ కూడలి వద్దకు వచ్చి అరుపులు, కేకలతో సంబరాలు చేసుకున్నారు. స్థానికంగా ఉండే హాస్టల్స్‌లోని యువకులు అంతా రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీరిలో కొందరు రోడ్డుపై వెళ్లే వాహనదారులను వేధించడంతో బాధితులు డయల్ 100కు ఫోన్ చేశారు.