Underground Mines Gradually Decreasing In Singareni : సింగరేణిలో ఉపరితల గనులకు ప్రాధాన్యత పెరిగింది. కానీ, అది కార్మికుల్లో ఆందోళనకు కారణమైంది. కారణం భూగర్భ బొగ్గుగనుల స్థానంలో ఉపరితల గనులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడమేమే. ఓపెన్ కాస్ట్ గనుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లక్షలాది మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు భూగర్భజల వనరులు అడుగంటడంతో పాటు వ్యవసాయం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు సింగరేణి గనులు ఉపాధి కల్పించే కేంద్రాలు ఉండగా ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయనేది కార్మికుల వాదన. మరి ఎందుకీ పరిస్థితి? కార్మికులకు కావాల్సిందేంటి?