Telangana CM Revanth Reddy Foreign Tour : పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం నేటి నుంచి విదేశాల్లో పర్యటించనుంది. స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై ఒప్పందాలతోపాటు పెట్టుబడులపై సింగపూర్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. అక్కడి నుంచి ఈనెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.