సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అధికారులు తెలియజేశారు. తన పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు.