Pawan Kalyan Visit Kuridi : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడ మండలంలోని కురిడి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులతో కలసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్‌కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.