Praja Palana Vijayotsavalu In Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నవంబరు 14 నుంచి నిన్నటి వరకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు, వేడుకలను జరిపారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో ఉత్సవాలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ఎల్బీ స్టేడియంలో విద్యా దినోత్సవంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత వరంగల్‌లో మహిళ విజయోత్సవాలు, మహబూబ్‌నగర్‌లో రైతు పండగ, పెద్దపల్లిలో యువజన ఉత్సవాల పేరుతో ప్రభుత్వం సభలు నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసింది. సీఎం, మంత్రులు వివిధ వేదికల ద్వారా ఏడాది పాలన విజయాలను వివరించారు.