తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. హైదరాబాద్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఆయన వివరించారు.