ఇంటికెళ్లి మరీ అవకాశాల పేరుతో నమ్మించి మోసం చేసిన సినీ కో-ఆర్డినేటర్

  • 6 years ago
A woman on friday complainted to Banjarahills police on Cine co-ordinator Srishanth Reddy.

జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డ సినీ-కోఆర్డినేటర్ శ్రీశాంత్ రెడ్డి వ్యవహారంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీశాంత్ రెడ్డి.. అదే అదునుగా భావించి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శ్రీశాంత్ రెడ్డిని కోరగా అందుకు తిరస్కరించాడు.
ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం మానేపల్లికి చెందిన శ్రీశాంత్‌రెడ్డి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇందిరానగర్‌లో నివాసం ఉంటూ సినీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో గతేడాది అక్టోబరులో ఓ మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అతనికి పరిచయమైంది.
సదరు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని శ్రీశాంత్ రెడ్డి నమ్మించాడు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్ 10న బోరబండలోని ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తర్వాత ఆమెకు కూల్ డ్రింక్ ఇవ్వడంతో.. కాసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఆ మహిళ స్పృహ కోల్పోవడంతో శ్రీశాంత్ రెడ్డి ఆమెపై అత్యాచారం జరిపాడు. అంతేకాదు, ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు అభరణాలు, రూ.5 లక్షలు చోరీ చేసి పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని కలిసినప్పుడు దీనిపై ఆమె నిలదీసింది. దీంతో పెళ్లికి కట్నం కింద తీసుకున్నాను అనుకో అంటూ బుకాయించాడు. కొద్దిరోజులకు పెళ్లి చేసుకోవాలని కోరగా.. అందుకు తిరస్కరించాడు.
శ్రీశాంత్ రెడ్డి తనను మోసం చేయడంతో బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమె వెంట సినీ ఆర్టిస్టులు శ్రీరెడ్డి, సోనారాథోడ్‌, రాగసృతి, సునితారెడ్డిలు కూడా వచ్చారు.

Category

🗞
News

Recommended