టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో తవ్వే కొద్దీ ఒక్కో నిజం బయటకు వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమని ఒక్కో వివాదం చుట్టుముడుతున్న సమయంలో ఈ సెక్స్ రాకెట్ కూడా సంచలనం సృష్టిస్తోంది. పలువురు స్టార్ హీరోయిన్స్ ఇందులో ఇరుక్కున్నారని ప్రచారం జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఓ హీరోయిన్ కు ఎదురైనా చేదు అనుభవం ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో మరో కోణాన్ని ఆవిష్కరించింది.
అమెరికాలో జరిగే తెలుగు అసోసియేషన్ ఈవెంట్ కు హాజరు కావాలని ఆ హీరోయిన్ ని అమెరికా తీసుకుని వెళ్లే ప్రయత్నం జరిగింది. ఆ ఈవెంట్ అమెరికా మిడ్ ఈస్టన్ ప్రాంతంలోని ఓ నగరంలో జరుగుతుంది. అది దాదాపుగా కెనడా బోర్డర్ లో ఉంది.
అంతా సిద్ధం చేసుకున్నాక హైదరాబాద్ లో ఉన్న కిషన్ కోఆర్డినేటర్ నుంచి హీరోయిన్ మేనేజర్ కు మెసేజ్ వెళ్ళింది. ఆమె ప్లెక్సిబుల్ యేనా అని అడుగుతూ మెసేజ్ పెట్టారు.
హీరోయిన్ కు , ఆమె మేనేజర్ కు జరుగుతున్న పరిణామాలు అనుమానంగా ఉండడంతో వ్యభిచారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. దీనితో వెంటనే సదరు హీరోయిన్ తన యుఎస్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గత ఏడాది జరిగినట్లు సమాచారం అందుతోంది.
ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లే హీరోయిన్స్ కు ఈవెంట్స్ కోసం సపరేట్ గా రెమ్యునరేషన్ ఇస్తారట. అది 5 లక్షల వరకు ఉంటుంది. ఇక వ్యభిచారానికి అంగీకరిస్తే హెరాయిన్ స్థాయిని బట్టి అధికమొత్తంలో డాలర్స్ ఆఫర్ చేస్తారట. అమెరికా పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
Category
🎥
Short film