హీరోయిన్ ఇలియానా ఫోటోలు నెట్ లో వైరల్

  • 6 years ago
హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన టాప్‌లెస్ ఫోటోతో పాటు దాని కింద చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టు ద్వారా ఆమె తన అభిమానులకు ఒక సాధికారిక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందులో F**K అనే బూతు పదం వాడటం చర్చనీయాంశం అయింది. రవితజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ గోవా బ్యూటీ ఈ పోస్ట్ ద్వారా వార్తల్లో నిలిచింది.
ఇలియానా పోస్టు చేసిన ఈ టాప్ లెస్ ఫోటో... దానికింద చేసిన ఘాటైన కామెంటులో చాలా అర్థం ఉంది. ‘‘ఎవరి వల్లా నువ్వు ఈ స్థితికి రాలేదు, నీ జీవితంలో చీకటి, వెలుగులకు పూర్తి కారణం నువ్వే... అలా కాదు తామే అని ఎవరైనా విర్రవీగితే ‘ఫక్ దెయిర్ ఓపీనియన్స్' అంటూ ఇలియానా పేర్కొన్నారు.
తెలుగులో ‘దేవదాసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఇలియానా వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక సమయంలో సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీగా రికార్డులు సృష్టించింది. రవితేజతో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు' తర్వాత టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్ బాట పట్టిన ఈ గోవా బ్యూటీ మళ్లీ రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారానే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Recommended