AP CM Chandrababu Distributed Pensions: రాష్ట్రంలో ఒక్క రోజులోనే 97 శాతం పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం, రాయలసీమను సిరుల సీమగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వినూత్న విధానాలతో మళ్లీ ఏపీని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. రాళ్ల సీమను రత్నాల సీమగా చేసే బాధ్యత తమదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మేం ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని అన్నారు. వారు మహిళలకు అవకాశం ఇవ్వాలని అన్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని కొనియాడారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తాను సభలో కనిపిస్తేనే కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.