Man Missed in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాళ్లవాగు వరద ఉద్ధృతిలో డీసీఏం వ్యాన్ కొట్టుకు పోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 5 గంటల పాటు శ్రమించి అందులో నలుగురిని రక్షించింది. ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు.