CM Chandrababu Condolence to Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, కేశినేని చిన్ని మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చంద్రబాబు అన్నారు. మన్మోహన్సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్సింగ్ కుటుంబసభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు.