Manchu Mohan Babu Family Disputes : నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ తెలంగాణలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొనడం సంచలనం రేపింది. మనోజ్‌కు అతని తండ్రికి మధ్య ఘర్షణ జరిగిందంటూ ఆదివారం ఉదయం విస్తృతంగా ప్రచారం జరిగింది. అదంతా తప్పుడు ప్రచారమని మోహన్ బాబు కుటుంబం ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ తర్వాత మంచు మనోజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేయడం మోహన్ బాబు, మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి.