Daughter Taking Care Mother : తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయసు బడికెళ్లి పాఠాలు వినాల్సిన సమయం. కానీ విధి ఆ చిన్నారిని చిన్నచూపు చూసింది. తండ్రి ఇంటిని వదిలేసి వెళ్లిపోగా తొమ్మిదేళ్లుగా తల్లి మంచానికే పరిమితమైంది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్న తల్లికి అమ్మగా మారింది ఆ పదకొండేళ్ల చిన్నారి. కడు పేదరికంతో కనీసం తినడానికి సరైన తిండిలేక వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.