IT Hub In Khammam : ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఐటీ ఉద్యోగం ఓకల. ఐటీ ఉద్యోగాల కోసం గతంలో హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సి ఉండేది. కానీ జిల్లాల్లో ఐటీ హబ్‌ల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వాళ్ల ముంగిటకే చేరాయి. ఖమ్మంలో కొలువు దీరిన ఐటీహబ్-1లో ఇప్పటికే దాదాపు 600 మంది ఉద్యోగాలు దక్కించుకొని ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. రెండో ఐటీహబ్ విస్తరణ చేపట్టేందుకు మూడేళ్ల క్రితమే ముందడుగుపడినా ఇప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. కొండంత ఆశతో ఐటీకొలువులు దక్కుతాయని ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు