KTR Attend ACB Inquiry in Formula E-Race Case : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, కేబినెట్లో ఉండి తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని తెలిపారు. తాను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదని, ఆ పనులు రేవంత్ రెడ్డి, వారి సహచర మంత్రులకే ఉన్నాయని అన్నారు. అరపైసా అవినీతి కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు.