మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలవాలని చెప్పిన విషయం తనకు గుర్తుందని తెలిపారు. కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు తననకు తెలుసని, దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చానని అన్నారు. గ్యాస్ సిలిండర్‌కు మీరు కట్టిన డబ్బు 48 గంటల్లో రిఫండ్ అయ్యేలా చూస్తామని, సిలిండర్‌కు డబ్బు కట్టే పని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాని హామీ ఇచ్చారు. 64 లక్షల మందికి పింఛను ఇస్తున్న ప్రభుత్వం తమదని, అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వం వద్ద డబ్బు లేదని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అండగా ఉన్నామని, పింఛను మొత్తాన్ని 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చని అన్నారు. పింఛను ఎవరు ఆపినా నిలదీయండని, అది మీ హక్కు. పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదికలో చంద్రబాబు మాట్లాడారు.