CM Chandrababu Naidu About Nominated Posts : జూన్ 12 నాటికి నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి పాలన సాగుతుందన్న సీఎం అది కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రతిబింబించాలన్నారు. రాయలసీమకు సాగునీళ్లిచ్చి ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.