CM Chandrababu Naidu Comments : ప్రజా ప్రతినిధుల ప్రవర్తన వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు. ఇసుక, మద్యం విధానాల్లో వైఎస్సార్సీపీ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.