CM Chandrababu on Law and Order: రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. శాంతిభద్రతల అంశంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు పలు సూచనలు చేశారు. వివేకా గొడ్డలిపోటు హత్యను గుండెపోటుగా మార్చారని మండిపడ్డారు. 36 మందిని రాజకీయ హత్యలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని, అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు.