CM CHANDRABABU COMMENTS: ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరితో సమీక్ష నిర్వహించిన సీఎం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు.