CM Chandrababu Comments at Yallamanda: డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని, రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెగుళ్లు ఉందని అనుమానం రాగానే డ్రోన్స్ వస్తాయని, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలని, ఆదాయం పెరగాలని తెలిపారు. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రైతులేనని అన్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామస్థులతో మాట్లాడారు.