CM Chandrababu Inspected Grain Purchase Centers: ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని సూచించారు.