CM Chandrababu Naidu on Floods: బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడిన జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారో తనకి తెలియట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాడు వరదల్లో రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగిన జగన్, నేడు గతిలేక బురదలో దిగారని దుయ్యబట్టారు. విపత్తులని ఎదుర్కొనే విషయంలో జగన్ నుంచి తాము నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టం చేశారు. ఓ పథకం ప్రకారమే అమరావతిపై పనిగట్టుకొని జగన్ విషప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.