CM Chandrababu Review On Floods: వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను తీరం దాటిన చోట కంటే ఇతర చోట్ల ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయన్న సీఎం జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయని వెల్లడించారు. వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర క్లియరెన్స్ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి మునిగిందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు.