CM Revanth Review On Khammam Floods : వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడిన సీఎం, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. నష్టం తీవ్రంగా ఉన్నందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామని ముఖ్యమంత్రి తెలిపారు.