KTR CHALLENGES CM REVANTH : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దుయ్యబట్టారు. రుణమాఫీలో అనేక కటింగ్‌లు పెట్టారని, సీఎం అంటే కటింగ్ మాస్టర్లా తయారయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు ఈ తెలంగాణ పోలీసు అకాడమీలో ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అకాడమీలో 2023కు బ్యాచ్‌కు చెందిన 535మంది సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణ కొనసాగుతోంది. వీరిలో 401 సివిల్, 29మంది స్పెషల్ పోలీసు, 71మంది ఆర్మ్డ్ రిజర్వు, 12 మంది ఎస్పీఎఫ్, 22 మంది ఐటీ కమ్యూనికేషన్‌తోపాటు మరో 9 మంది ఫింగర్ ప్రింట్, 3గురు ట్రాన్స్పోర్ట్ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది.