KTR and Harish Rao on CM Revanth : బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవని, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ అని మాజీమంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఇవాళ తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడుల అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు సైతం ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.