KTR Fires on Congress Party : రాష్ట్రంలో అలవికానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు కంటే మించిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు రూ.12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.