Minister Konda Surekha Fires on KTR : అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల వైఖరి ఆటవిక సమాజాన్ని తలపిస్తోందని విమర్శించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటామన్నారు. మహిళను వ్యక్తిగతంగా అవమానించటం మాత్రం సరికాదని మంత్రి సురేఖ హెచ్చరించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.