Skip to playerSkip to main contentSkip to footer
  • 5/2/2018
BJP leader Vishnu Kumar Raju make shocking comments on YSRCP chief YS Jagan and AP CM Chandrababu Naidu.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని, అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. అయితే, ఏ పార్టీ అయినా తమ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటుందని, కానీ విష్ణు.. జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడం గమనార్హం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విష్ణు కుమార్ రాజు చెప్పారు. పొత్తు నిర్ణయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే 2019కి ముందు ఏ పార్టీతో పొత్తు లేకున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఏదో ఒక పార్టీతో జత కడుతారని భావిస్తున్నారు.
వైసీపీ గ్రాఫ్ పెరిగింది, టీడీపీ ఓటమి ఖాయం: విష్ణు సంచలనం, జగన్ ఆగ్రహం

#YS Jagan
#Vishnu Kumar Raju
#Chandrababu Naidu

Category

🗞
News

Recommended