Kanchi Jayendra Saraswathi With YS Jagan, Pics Viral
  • 6 years ago
Kanchi kamakoti Peetham Jayaendra Saraswathi has opposed the demand of Telangana state in past. YSRCP President YS Jagan Meet Kanchi Kamakoti Peetam Jayendra Saraswathi on 18th Aug 2016.

కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందిన విషయం తెలిసిందే. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని వివాదాలు చుట్టుముట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకించారు. అంతేకాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పరమదించిన సందర్భంలో తెలంగాణవాళ్లు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన జయేంద్ర సరస్వతికి ఈ విషయాలు ఎందుకని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరో కాశ్మీరులా మారే ప్రమాదం ఉందని అప్పట్లో జయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. విభజన జరిగితే తెలంగాణలో అన్యమతస్థులు తిష్ట వేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దానివల్ల అల్లర్లు పెరుగుతాయని హెచ్చరించారు.
సామాజిక సేవ పట్ల జయేంద్ర సరస్వతి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు పాఠశాలలు ఆస్పత్రులు ప్రారంభించారు. శంకర నేత్రాలయ, పిల్లల ఆస్పత్రి, హిందూ మిషన్ ఆస్పత్రి వంటివాటిని ప్రారంభించారు. ఒక రకంగా మానవ సేవ మాధవ సేవ అని భావంచారు. ఆయన హయంలో కంచి బలమైన పీఠంగా ఎదిగింది.
జయేంద్ర సరస్వతి 1987 ఆగస్టు 22వ తేదీన కంచి మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. మఠం నియమావళిని అనుసరించి అలా చేయడానికి వీలు లేదు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. మఠం నుంచి జయేంద్ర సరస్వతి మాయం కావడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అదృశ్యమైన జయేంద్ర సరస్వతి కోసం పోలీసులు గాలించారు. చివకు ఆయన కర్ణాటకలోని కూర్గులో గల తలకావేరి వద్ద కనిపించారు. ఆయన అలా ఎందుకు చేశారనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయంగానే ఉండిపోయింది.
జయేంద్ర సరస్వతిని కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జగన్ 2016 ఆగస్టు 18వ తేదీన జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌కు జయేంద్ర సరస్వతి ఆశీస్సులు ఉన్నాయని చాటేందుకు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
Recommended