Minister Konda Surekha Explanation Comments on KTR : తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం (అక్కినేని కుటుంబం) పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆమె నివాసంలో మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, 'నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదు, ఆయన నాకు క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్ చేసిందంతా చేసి, దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాం.' అని ఆమె స్పష్టం చేశారు.