Minister Ponnam Comments : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీల కోసం తన వద్దకు రావోద్దని సూచించారు. ఈ రెండు విషయాలలో తనపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం కొన్ని వందల వేల మంది వస్తున్నారన్నారు. ఆర్టీసీకి సంబంధించిన మంత్రిని అయినా కూడూ బదిలీల విషయంలో తానేమి చేయలేనన్నారు. ఈ రెండు పనులు తప్ప హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులు చేస్తానని స్పష్టం చేశారు.