BJP Public Meeting At Saroornagar : తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై కిషన్ రెడ్డి సారథ్యంలోని బీజేపీ పోరాటం చేసిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు, మహిళా, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని నడ్డా ఆక్షేపించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు